NTR Trust: 27 ఏళ్లు పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ ట్రస్ట్.. సిబ్బందికి చంద్రబాబు అభినందనలు

NTR trust completes 27 years Chandrababu wishes staff
  • సిబ్బంది, వలంటీర్లు అంకితభావంతో సేవలందిస్తున్నారని ప్రశంస
  • ఎన్టీఆర్ ఆశయసాధన కోసమే ట్రస్ట్‌ను ఏర్పాటు చేశామన్న చంద్రబాబు
  • అన్ని రంగాల్లోనూ విశేష సేవలు అందిస్తోందన్న టీడీపీ అధినేత

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 27 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సిబ్బంది, వలంటీర్లకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు.

ఎన్టీఆర్ ఆశయ సాధనకు తాను నెలకొల్పిన ట్రస్ట్ రక్తదానం, ఆరోగ్య సంరక్షణ, విద్య, సాధికారత, జీవనోపాధి రంగాల్లో సేవలందించడంతోపాటు ప్రకృతి విపత్తులో సైతం ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. సిబ్బంది అంకితభావంతో సేవలందిస్తున్నారని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News