YS Bharathamma: పులివెందుల ఓటర్ల జాబితా.. జగన్ కుటుంబ సభ్యుల వివరాల్లో కూడా తప్పులు 

Wrong details of Jagan family members in voter list
  • పులివెందుల 138 పోలింగ్ కేంద్రంలో జగన్, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు
  • జగన్ పెద్దమ్మ పేరును వైఎస్ భారతి రెడ్డి అని ముద్రించిన వైనం
  • భర్త పేరు కూడా తప్పుగా ముద్రణ
ఏపీ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యుల వివరాలు కూడా తప్పుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. పులివెందుల పురపాలక సంఘం పరిధిలో ఉన్న 138వ పోలింగ్ కేంద్రంలో జగన్, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయి. ఓటర్ల జాబితాలో జగన్ పెద్దమ్మ వైఎస్ భారతమ్మ పేరును వైఎస్ భారతి రెడ్డి అని ముద్రించారు. అంతేకాదు ఆమె భర్త జార్జ్ రెడ్డి పేరును కూడా తప్పుగా పేర్కొన్నారు. వయసు 60 సంవత్సరాలు అని ముద్రించారు. 

YS Bharathamma
Jagan
YSRCP
Voter List

More Telugu News