KTR: ఎమ్మెల్యే లాస్య నందితను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్

Former minister KTR visited MLA Lasya Nanditha as she met accident recently
  • ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురైన ఎమ్మెల్యే
  • తలకు గాయాలవ్వడంతో పరామర్శకు వెళ్లిన మాజీ మంత్రులు
  • ‘ఎక్స్’ వేదికగా ఫొటోలు షేర్ చేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే
ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను ఆయన ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎమ్మెల్యే లాస్య నందిత ‘ఎక్స్’ వేదికగా షేర్ చేశారు. 

నల్లగొండ మండలం చర్లపల్లిలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఓ హోంగార్డు చనిపోయాడు. మరో కానిస్టేబుల్‌ కూడా గాయపడ్డాడు. ఎమ్మెల్యే లాస్య నందిత తలకు గాయాలయ్యాయి. ఆమెతో పాటు కారులో ఎమ్మెల్యే సోదరి నివేదిత, ఇద్దరు గన్‌మెన్లకు కూడా స్వల్ప గాయాలైన విషయం తెలిసిందే.
KTR
Lasya Nanditha
Road Accident
BRS

More Telugu News