Vellampalli Srinivasa Rao: మంగళగిరి నుంచి లోకేశ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరు: వెల్లంపల్లి శ్రీనివాస్

Nara Lokesh can not win from Mangalagiri says Vellampalli Srinivas
  • వైసీపీలో మిగిలిపోయిన స్క్రాప్ టీడీపీలోకి వచ్చిందన్న వెల్లంపల్లి
  • ఆ స్క్రాప్ ను చూసి పిచ్చి వేషాలు వేయొద్దని లోకేశ్ కు వార్నింగ్
  • మీ నాన్నకే జగన్ భయపడలేదు.. నువ్వెంత అని వ్యాఖ్య
టీడీపీ యువనేత నారా లోకేశ్ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యారని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేశ్ జీవితంలో ఎమ్మెల్యే కాలేరని... అసెంబ్లీలో అడుగు పెట్టలేరని అన్నారు. వైసీపీలో మిగిలి పోయిన స్క్రాప్ టీడీపీలోకి వచ్చిందని... ఆ స్క్రాప్ ను చూసి పిచ్చి వేషాలు వేయొద్దని లోకేశ్ కు వార్నింగ్ ఇచ్చారు. విజయవాడ మధుర నగర్ 29వ డివిజన్ లో గడప గడపకు కార్యక్రమంలో వెల్లంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

జగన్ గురించి లోకేశ్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీ నాన్నకే జగన్ భయపడలేదు.. నువ్వెంత? అని ప్రశ్నించారు. కుప్పంలో మీ నాన్న, పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతారని అన్నారు. కుప్పంలో మీ తండ్రి, భీమవరంలో పవన్ కల్యాణ్, మంగళగిరిలో నువ్వు గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబు 16 నెలల పాటు జగన్ ను ఇబ్బంది పెట్టారని విమర్శించారు.
Vellampalli Srinivasa Rao
Jagan
YSRCP
Nara Lokesh
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena

More Telugu News