Jai Hanuman: 'హనుమాన్' సీక్వెల్ 'జై హనుమాన్' హీరోగా కేజీఎఫ్ స్టార్ యష్?

  • ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచిన 'హనుమాన్'
  • బాక్సాఫీస్ ను షేక్ చేసిన 'హనుమాన్'
  • ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న 'జై హనుమాన్'
KGF star Yash in Jai Hanuman movie

ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా 'హనుమాన్' చిత్రం నిలిచిన సంగతి తెలిసిందే. రూ. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత హై క్వాలిటీ విజువల్స్ ఎలా సాధ్యమని ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. 

మరోవైపు, ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సీక్వెల్ లో హనుమాన్ హీరోగా ఉంటాడని... ఈ పాత్రను ఓ స్టార్ హీరో పోషిస్తారని ఆయన తెలిపారు. దీంతో, ఈ పాత్రకు రానాను తీసుకుంటారని ప్రేక్షకులు ఆల్ మోస్ట్ డిసైడ్ అయ్యారు. అయితే, ఈ పాత్రకు కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో యష్ ని తీసుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారని తాజా సమాచారం. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న యష్ నటిస్తే... ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది సీక్వెల్ విడుదలవుతుందని ప్రశాంత్ వర్మ తెలిపారు.

More Telugu News