Basara: బాసరలో వసంత పంచమి వేడుకలు ప్రారంభం

  • అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని 108 కలశాల జలాభిషేకం
  • పద్మశాలి సంఘం తరుపున పట్టువస్త్రాల సమర్పణ
  • పూజాకార్యక్రమాల్లో పాల్గొన్న ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
  • పెద్దఎత్తున అక్షరాభ్యాస కార్యక్రమాలు 
Vasant Panchami event in basara nirmal Telangana

తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని 108 కలశాల జలాలతో అభిషేకం నిర్వహించారు. పద్మశాలి సంఘం తరుపున ఆందజేసిన చేనేత పట్టువస్త్రాలతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సేవలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. ఇక బాసరలో అక్షరాభ్యాసం చేయించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని వచ్చారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

More Telugu News