Congress: కేటీఆర్, హరీశ్ రావులను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు

Congress activists obstruct ktr and harish rao in hyderabad
  • నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగసభకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్, హరీశ్ రావు
  • వీటి కాలనీ వద్ద అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
  • కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు
మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న బహిరంగ సభకు వారు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. వీరిని వీటీ కాలనీ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. 'కేటీఆర్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ స్పల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. కాంగ్రెస్ కార్యకర్తలు తమ వీపులకు గో బ్యాక్ కేసీఆర్ అనే స్టిక్కర్లు అంటించుకున్నారు.
Congress
BRS
KTR
Harish Rao

More Telugu News