Sajjanar: యాక్సిడెంట్ వీడియోను షేర్ చేసిన సజ్జనార్

Sajjanar shares accident video
  • వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న సజ్జనార్
  • వెనుక నుంచి వస్తున్న వాహనాలను గమనించి కారు డోర్ తీయాలని సూచన
  • నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు కారణం కావద్దని హితవు
వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. కారు డోర్ తీసేటప్పుడు జాగ్రత్త వహించాలని చెప్పారు. వెనుక నుంచి వస్తున్న వాహనదారులను గమనించి డోర్ తీయాలని అన్నారు. సడన్ గా కారు డోర్ తీయడంతో ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురైన ఓ వీడియోను ఆయన షేర్ చేశారు. ఈ వీడియో గురించి ఆయన చెపుతూ... తొందరగా వెళ్లాలనే హడావుడిలో ఇలా అజాగ్రత్త, నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు కారణం కావద్దని... ఎందుకంటే అందరినీ ఈ బైకర్ లా అదృష్టం వరించదని చెప్పారు. 

Sajjanar
Accident Video

More Telugu News