ఢిల్లీలోకి బలవంతంగా చొరబడుతున్న రైతులపై చర్యలు తీసుకోండి.. సీజేఐకి ఎస్‌సీబీఏ అధ్యక్షుడి లేఖ
- రైతులు ఢిల్లీలోకి చొరబడితే జనజీవనం అస్తవ్యస్తమైపోతుందన్న అదిష్ అగర్వాల
- కోర్టులకు హాజరుకాని లాయర్లపై చర్యలు తీసుకోకుండా చూడాలని వినతి
- రైతు ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా రైతులు ఆగకపోవడంతోనే లేఖ రాశానని వివరణ
రైతు ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికీ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలివస్తుండడంతో తాను ఈ లేఖ రాయాల్సి వచ్చిందని అదిష్ పేర్కొన్నారు. కాగా, 2021, 2022లోనూ ఆందోళనకు దిగిన రైతులు కొన్ని నెలలపాటు ఢిల్లీకి దారితీసే మూడు సరిహద్దులను దిగ్బంధం చేశారు. సరిహద్దుల దిగ్బంధం కారణంగా మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఆసుపత్రులకు వెళ్లాలనుకున్న పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే అదిష్ అగర్వాల లేఖ రాశారు.