Sanjana Ganesan: జస్ప్రీత్ బుమ్రా భార్యకు బాడీ షేమింగ్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పేసర్ భార్య

Body Shaming On Jasprit Bumrah Wife Sanjana Ganesan
  • లావుగా ఉన్నావంటూ సంజనను కామెంట్ చేసిన ఇన్‌స్టా యూజర్
  • సీరియస్‌గా రిప్లై ఇచ్చిన సంజన
  • ప్రశంసిస్తున్న నెటిజన్లు
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన గణేశ్ బాడీ షేమింగ్ ఎదుర్కొన్నారు. ఆమె వాలెంటైన్స్ డే ప్రమోషనల్ పోస్టుకు ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ బాడీ షేమింగ్ కామెంట్స్ చేశాడు. ‘భాభీ మోటీ లగ్ రహీ హై’ (మీరు చాలా లావుగా కనిపిస్తున్నారు) అని కామెంట్ చేశాడు. దీనికి సంజన సీరియస్ కౌంటర్ ఇచ్చారు. ‘‘నీకు స్కూల్ సైన్స్ పాఠ్య పుస్తకాలు కూడా గుర్తున్నట్టు లేదు. మహిళల శరీరంపై కామెంట్ చేస్తావా, ఎంత ధైర్యం? పో.. ’’ అని తీవ్రంగా స్పందించారు. ఆమె రిప్లైపై ప్రశంసలు కురుస్తున్నాయి.

గాయం కారణంగా కొంతకాలంపాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నా బుమ్రా రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభం కానున్న మూడో టెస్టుకు రెడీ అవుతున్నాడు. వైజాగ్ టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా ఏకంగా 9 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించాడు. ఖాళీ సమయాల్లో కుటుంబంతో గడుపుతూ ఉంటాడు. 

రెండో టెస్టు విజయం తర్వాత భార్య సంజనతో కలిసున్న ఫొటోను పోస్టు చేసిన బుమ్రా.. ‘‘ఆనందం ఇక్కడే ఉంది’’ అని దానికి క్యాప్షన్ తగిలించాడు. కాగా, సంజన ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్. బుమ్రా జంట ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
Sanjana Ganesan
Jasprit Bumrah
Team India
Body Shaming

More Telugu News