Medigadda Barrage: నేడు తెలంగాణ ఎమ్మెల్యేల మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన

  • కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఆరోపణలు
  • ప్రభుత్వ ఆధ్వర్యంలో నేడు ఎమ్మెల్యేల మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన
  • అనంతరం పార్టీ అధిష్ఠానంతో రివ్యూ మీటింగ్
Congress MLAs medigadda tour begins today

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో నీళ్ల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కమిషన్ల కక్కుర్తి కోసం నాసిరకంగా మేడిగడ్డను నిర్మించారంటూ ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 

ఈ క్రమంలో నేడు (మంగళవారం) తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు వెళ్లనున్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మేడిగడ్డను సందర్శించాలని, ఇందుకోసం ప్రభుత్వం బస్సులను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. 

పర్యటన షెడ్యూల్ ఇదే 

  • ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులలో మేడిగడ్డకు ప్రయాణం
  • మధ్యాహ్నం 2 గంటలకు మేడిగడ్డకు చేరుకోనున్న ఎమ్మెల్యేలు
  • మధ్యాహ్నం 2 నుంచి 3 వరకూ బ్యారేజ్ సందర్శన
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకూ అధిష్ఠానంతో రివ్యూ మీటింగ్
  • సాయంత్రం 5 గంటలకు మేడిగడ్డ నుంచి తిరుగుప్రయాణం
  • రాత్రి 9.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్న ఎమ్మెల్యేలు

More Telugu News