KTR: ఇంగ్లీష్‌లో ప్రజెంటేషన్ ఇచ్చారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీపై కేటీఆర్

  • ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు మాకే అర్థం కాలేదు... ఇక ప్రజలకు ఏం అర్థమవుతాయన్న కేటీఆర్
  • మంత్రి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడారని విమర్శలు
  • సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానానికి శాసన సభ ఆమోదం
KTR satire on Uttam Kumar Reddy PPT

ఇరిగేషన్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై (పీపీటీ) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు మాకే అర్థం కాలేదు... ఇక ప్రజలకు ఏం అర్థమవుతాయి? అని ప్రశ్నించారు. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉందన్నారు. మంత్రి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడారన్నారు.

సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానానికి ఆమోదం

సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం శాసన సభ ఆమోదం పొందింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. తీర్మానం ఆమోదం పొందిన తర్వాత రేపు ఉదయం పది గంటల వరకు శాసన సభను వాయిదా వేశారు.

More Telugu News