North Korea: దక్షిణ కొరియా సరిహద్దు సమీపంలోని దీవిపై బాంబుల వర్షం కురిపించిన ఉత్తర కొరియా

  • ఆయుధ పరీక్షలు కొనసాగిస్తున్న ఉత్తర కొరియా
  • తాజాగా మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించిన సైన్యం
  • నిర్ధారించిన ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా 
North Korea test fires new multiple rocket launcher

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ దుందుడుకు తత్వం, కవ్వింపు చర్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, దక్షిణ కొరియా సరిహద్దులకు సమీపంలోని ఓ దీవిపై ఉత్తర కొరియా బాంబుల వర్షం కురిపించింది. 

ఇప్పటికే అణు ఆయుధాలు, ఖండాంతర క్షిపణులను ప్రయోగించి అంతర్జాతీయ సమాజం ఆగ్రహానికి గురైన ఉత్తర కొరియా... కొత్తగా మల్టిపుల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను పరీక్షించింది. ఈ రాకెట్ లాంచర్ నుంచి 240 ఎంఎం ఆర్టిలరీ షెల్స్ ను దక్షిణ కొరియాకు దగ్గర్లోని ఓ దీవిపై ప్రయోగించింది. 

ఈ రాకెట్ లాంచర్ పరీక్షలను ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా సంస్థ కేసీఎన్ఏ నిర్ధారించింది. షెల్ అండ్ బాలిస్టిక్ కంట్రోల్ సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ నూతన ఆయుధ వ్యవస్థ అభివృద్ధిలో తాజా పరీక్ష కీలకమైనదని కేసీఎన్ఏ వివరించింది.

More Telugu News