Rivaba: మామ గారి ఆరోపణలపై రవీంద్ర జడేజా అర్ధాంగి రివాబా ఏమన్నారంటే...!

Ravindra Jadeja wife Rivaba reacts on father in law allegations
  • ఇటీవల కోడలిపై తీవ్ర ఆరోపణలు చేసిన జడేజా తండ్రి
  • ఆమె తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని వ్యాఖ్యలు
  • తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రివాబా
  • కుటుంబ వివాదాలపై ప్రశ్నించిన మీడియా
  • ఈ కార్యక్రమంలో ఇలాంటివి అడుగుతారా? అంటూ అసహనం
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్ జడేజా ఇటీవల తన కోడలు రివాబాపై తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. రివాబా తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని, ఆమె తమ ఇంట అడుగుపెట్టినప్పటి నుంచి తమ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయని వివరించారు. తన కుమారుడు రవీంద్ర జడేజా సంపాదనను రివాబా కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తున్నారని అనిరుధ్ సింగ్ మండిపడ్డారు. 

జడేజా భార్య రివాబా ప్రస్తుతం గుజరాత్ లోని జామ్ నగర్ (నార్త్) నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రివాబాను మీడియా కుటుంబ వివాదాలపై ప్రశ్నించింది. 

అందుకు రివాబా తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటి? మీరు అడుగుతున్నది ఏంటి? అని ఆ విలేకరిపై అసహనం ప్రదర్శించారు. మా కుటుంబ విషయాలు తెలుసుకోవాలనుకుంటే నన్ను విడిగా అడగండి... చెబుతాను... ఇక్కడ మాత్రం ఇలాంటివి అడగొద్దు అని రివాబా కరాఖండీగా చెప్పేశారు.
Rivaba
Ravindra Jadeja
Father-In-Law
Anirudh Sinh Jadeja
Team India
Gujarat

More Telugu News