Paragliding: పారాగ్లైడింగ్ పైలట్ తప్పిదం.. హైదరాబాద్ వాసి మృతి

  • హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో ఘటన, నిందితుడి అరెస్ట్, 
  • సేఫ్టీ బెల్ట్‌ను పైలట్ తనిఖీ చేయకపోవడంతో ప్రమాదం
  • మానవతప్పిదమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్న అధికారి
Hyderabadi tourist dies in paragliding accident in kulu himachalpradesh

హైదరాబాద్‌కు చెందిన ఓ టూరిస్టు పారాగ్లైడింగ్ చేస్తూ దుర్మరణం చెందారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

ఘటనపై కులూ పర్యాటక శాఖ అధికారిణి సునైనా శర్మ స్పందిస్తూ మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగుండొచ్చని అన్నారు. పారాగ్లైడింగ్ చేసిన ప్రదేశం, ఇందుకు వాడిన పరికరాలు, పైలట్‌కు అనుమతి ఉందన్నారు. ఘటన జరిగిన సమయంలో వాతావరణ సమస్యలు ఏవీ లేవని కూడా తెలిపారు. ఘటన నేపథ్యంలో అక్కడ పారాగ్లైడింగ్‌ను సస్పెండ్ చేసినట్టు కూడా వెల్లడించారు. కాగా, ప్రమాదానికి బాధ్యుడైన పైలట్‌పై ఐపీసీ 336, 334 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, టూరిస్టు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News