Bontu Ram Mohan: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్... దేనికి సంకేతం?

Bontu Ram Mohan met CM Revanth Reddy
  • ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్న బీఆర్ఎస్ నేతలు
  • తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో బొంతు రామ్మోహన్ భేటీ
  • రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కలుస్తుండడం పరిపాటిగా మారింది. తాజాగా, గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. అయితే, బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రిని కలవాల్సిన అవసరం ఏంటన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బొంతు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా, లేక ఆయన మర్యాదపూర్వకంగానే సీఎంను కలిశారా అనేదానిపై స్పష్టత లేదు. బొంతు రామ్మోహన్ గత రెండు పర్యాయాలు ఉప్పల్ బరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశించినా, అవకాశం దక్కలేదని తెలుస్తోంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు వస్తుండడంతో, ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Bontu Ram Mohan
CM Revanth Reddy
Congress
BRS
Telangana

More Telugu News