Chandrababu: చంద్రబాబుపై సీనియర్ జర్నలిస్ట్ రాసిన ‘మహాస్వాప్నికుడు’ పుస్తకావిష్కరణ నేడు

  • విజయవాడలో నేటి సాయంత్రం 4 గంటలకు ఆవిష్కరించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ
  • పూల విక్రమ్ రాసిన ఈ పుస్తకాన్ని ప్రచురించిన ప్రవాసాంధ్రుడు వెంకట్ కోడూరి
  • చంద్రబాబు బాల్యం నుంచి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల వరకు అన్నింటినీ పొందుపరిచిన రచయిత
Maha Swapnikuru Book On Chandrababu Launches Today

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై సీనియర్ జర్నలిస్ట్ పూల విక్రమ్ రచించిన ‘మహాస్వాప్నికుడు’పుస్తకాన్ని విజయవాడలో నేటి సాయంత్రం నాలుగు గంటలకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలగౌడ ఆవిష్కరించనున్నారు. కువైట్‌లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్ కోడూరి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. 

చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసంతోపాటు ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను ఈ పుస్తకంలో స్పృశించారు. చంద్రబాబుపై జరిగిన దుష్ప్రచారంపైనా ఇందులో సవివరంగా రాసుకొచ్చారు. చంద్రబాబు 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనపై అనేక అసత్య ప్రచారాలు చేశారని, అందులో ‘వ్యవసాయం దండగ’ అన్నది ఒకటని రచయిత పేర్కొన్నారు. 

వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు సంబంధించిన వార్తా పత్రికల క్లిప్పింగ్స్‌ను వెలికి తీయాలని అధికారులను ఆదేశించారని, సమాచారశాఖ ఉద్యోగులు వారం రోజులు వెతికినా ఏ పేపర్‌లోనూ అలాంటి స్టేట్‌మెంట్ వారికి కనిపించలేదని, దాంతో తేలుకుట్టిన దొంగల్లా కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉండిపోయారని రచయిత ఈ పుస్తకంలో పేర్కొన్నారు.

More Telugu News