Kishan Reddy: తెలంగాణ బడ్జెట్ పై కిషన్ రెడ్డి స్పందన

  • తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి  ప్రభుత్వం 
  • అంకెల గారడీ, మాటల గారడీ అంటూ కిషన్ రెడ్డి విమర్శలు
  • గత ప్రభుత్వాన్ని తిట్టడానికే ఎక్కువ పేజీలు కేటాయించారని వ్యాఖ్యలు
Kishan Reddy reaction on Telangana budget

తెలంగాణలో నూతనంగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు తమ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఎన్నికల ప్రధాన హామీలైన ఆరు గ్యారెంటీలకు పెద్ద పీట వేస్తూ రూ.2,75,891 కోట్లతో తెలంగాణ ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రకటన చేశారు. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 

కాంగ్రెస్ పాలన అంకెల గారడీ, మాటల గారడీ అని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని తిట్టడానికే బడ్జెట్ లో ఎక్కువ పేజీలు కేటాయించారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో వాగ్దానాల కోసం కేటాయింపులు లేవని కిషన్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులనే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. 

సాగునీటి ప్రాజెక్టులకు రూ.28 వేల కోట్లు సరిపోవని స్పష్టం చేశారు. బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు కేటాయించి బీసీలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీల్లో రైతులకు ఇచ్చిన గ్యారెంటీ అమలు కానట్టేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

More Telugu News