Ranji Trophy: రంజీ ట్రోఫీలో చారిత్రాత్మక రికార్డు సృష్టించిన పృథ్వీ షా.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో తొలిసారి!

  • మ్యాచ్ తొలి రోజు మొదటి సెషన్‌లో 2 సెంచరీలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన యువబ్యాట్స్‌మెన్
  • ఛత్తీస్‌గడ్‌పై శతకం బాది అరుదైన రికార్డు సృష్టించిన ముంబై బ్యాట్స్‌మెన్
  • గాయం కారణంగా 6 నెలల విరామం తర్వాత అదిరిపోయే పునరాగమనం చేసిన క్రికెటర్
crickter Prithvi Shah created a historic record in the Ranji Trophy and first time in the history of Indian cricket

క్రికెటర్ పృథ్వీ షా దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన సెంచరీతో పునరాగమనం చేశాడు. ముంబై తరపున ఆడుతున్న ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ ఛత్తీస్‌గడ్‌పై శతకాన్ని నమోదు చేశాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-బీలో భాగంగా రాయ్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. 185 బంతులు ఎదుర్కొని 159 పరుగులు చేశాడు. ఇందులో 18 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో పృథ్వీ షా సంచలన రికార్డు నెలకొల్పాడు. రంజీ ట్రోఫీలో మ్యాచ్ తొలి రోజున మొదటి సెషన్‌లోనే 2 సెంచరీలు నమోదు చేసిన తొలి భారతీయ క్రికెటర్‌గా షా నిలిచాడు. ఇదివరకు అసోంపై కూడా ఇదే రీతిలో సెంచరీ నెలకొల్పాడు. రంజీ ట్రోఫీలో రెండవ అత్యధిక స్కోరు 379 సాధించే క్రమంలో ఆట మొదటి తొలి సెషన్‌లోనే సెంచరీ కొట్టాడు. దీంతో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ప్రారంభ సెషన్‌లో రెండు సెంచరీలు సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్రకెక్కాడు.

కాగా ఛత్తీస్‌గడ్‌పై మ్యాచ్‌లో భుపేన్ లాల్వానీతో కలిసి పృథ్వీ షా మొదటి వికెట్‌కు 244 పరుగుల భారీ పార్టనర్‌షిప్ నెలకొల్పాడు. దీంతో ముంబై 310/4 వద్ద మొదటి రోజు ఆట ముగిసింది. ప్రస్తుతానికి 5 మ్యాచ్‌లు ఆడిన ముంబై 4 విజయాలు, 1 ఓటమితో గ్రూప్-బీలో అగ్రస్థానంలో ఉంది. 

కాగా 24 ఏళ్ల ఈ యువ బ్యాట్స్‌మెన్ ఆరు నెలల విరామం తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. గతేడాది రంజీ ట్రోఫీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో బెంగాల్‌ వర్సెస్ ముంబై మ్యాచ్‌లో పృథ్వీ షా గాయపడ్డాడు. మోకాలి గాయంతో బాధపడ్డ అతడు లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్నాడు. ఇటీవల బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఫిట్‌నెస్ టెస్ట్‌లో అతడికి క్లియరెన్స్ లభించింది. 2018లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన యంగ్ టీమిండియాకు అతడు సారథ్యం వహించిన విషయం తెలిసిందే.

More Telugu News