తండ్రి ఆరోపణలను ఖండించిన క్రికెటర్ రవీంద్ర జడేజా
- కోడలు రివాబాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జడేజా తండ్రి
- తమ కుటుంబంలో రివాబా చీలికలు తెచ్చిందని ఆరోపణ
- అవి నిరాధారమైన ఆరోపణలన్న రవీంద్ర జడేజా
అయితే, తండ్రి వ్యాఖ్యలను రవీంద్ర జడేజా ఖండించాడు. ఆయన ఆరోపణలన్నీ నిరాధారం అని స్పష్టం చేశాడు. తన కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలా ఇంటర్వ్యూల పేరుతో ప్రయత్నిస్తున్నారని మండిపడ్డాడు. ఏకపక్షంగా ఇంటర్వ్యూను ప్రచురించడం సరికాదని, ఈ వ్యవహారం తమను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని జడేజా పేర్కొన్నాడు. ఈ మేరకు గుజరాతీ భాషలో సోషల్ మీడియాలో స్పందించాడు.