KVP Ramachandra Rao: జగన్ కంటే అసమర్థ ముఖ్యమంత్రి ఇంకెవరూ ఉండరు: కేవీపీ

There is no Chief Minister more incompetent than Jagan says KVP Ramachandra Rao
  • తల్లిని, చెల్లెలిని కూడా సంరక్షించుకోలేని వ్యక్తి జగన్ అని మండిపాటు
  • ఏ సీఎం కూడా జగన్ వెళ్లినన్ని సార్లు ఢిల్లీకి వెళ్లలేదని విమర్శ
  • ఏపీ అక్రమాల్లో బీజేపీ పెద్దలకు వాటాలు అందుతున్నాయా అని ప్రశ్న
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆత్మబంధువు కేవీపీ రామచంద్రరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. సొంత చెల్లెలు షర్మిల, కన్నతల్లి విజయమ్మను కించపరుస్తూ వైసీపీ మద్దతుదారులు దారుణమైన పోస్టులు పెడుతున్నా... జగన్ స్పందించడం లేదని ఆయన మండిపడ్డారు. తల్లిని, చెల్లెలిని సంరక్షించుకోలేని జగన్ కంటే అసమర్థ ప్రభుత్వ అధినేత దేశంలో ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీకి జగన్ వెళ్లినన్ని సార్లు ఏ ఇతర ముఖ్యమంత్రి కూడా వెళ్లలేదని అన్నారు. 

బీజేపీయేతర పాలన ఉన్న రాష్ట్రాల్లో పలువురు మంత్రులను ఈడీ అరెస్ట్ చేసిందని... ఏపీ మంత్రులను మోదీ ప్రభుత్వం ఎందుకు వదిలేసిందని ప్రశ్నించారు. ఏపీలో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలు, ఇసుక అక్రమాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని నిలదీశారు. ఏపీలో జరుగుతున్న అక్రమాల్లో బీజేపీ పెద్దలకు వాటాలు అందుతున్నాయా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుంటోందని విమర్శించారు.
KVP Ramachandra Rao
Congress
Jagan
YSRCP
AP Politics

More Telugu News