Uttam Kumar Reddy: కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగింతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావు

  • గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న ఉత్తమ్
  • ఎక్కడి నుంచో మినట్స్ తీసుకువచ్చి మేమేదో చేశామంటే ఎందుకు సమాధానం చెబుతామని నిలదీత
  • జలవనరుల కార్యదర్శులు సంతకాలు చేసిన సమావేశం మినట్స్ ఆధారంగా మాట్లాడుతున్నానన్న హరీశ్ రావు
Minister Uttam Kumar Reddy versus Harish Rao

గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్లుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తాము ఈ ప్రాజెక్టులను ఎవరికీ అప్పగించలేదని... అప్పగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎక్కడి నుంచో మినట్స్ తీసుకువచ్చి చదివి... మేమేదో చేశామని చెబితే మేం ఎందుకు జవాబు చెబుతామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి వల్ల మనకు నష్టం జరిగిందన్నారు. క్యాచ్‌మెంట్ ఏరియా ప్రకారం కృష్ణా జలాల్లో మనకు 68 శాతం వాటా దక్కాలన్నారు.

మినట్స్ ఎక్కడి నుంచో తెచ్చి మాట్లాడుతున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని... కానీ తాను ఎక్కడి నుంచో వీటిని తీసుకు రాలేదని హరీశ్ రావు న్నారు. కేఆర్ఎంబీ, కేంద్ర జలవనరుల కార్యదర్శి, తెలంగాణ జలవనరుల కార్యదర్శి, ఏపీ జలవనరుల కార్యదర్శి తదితరులు సంతకాలు పెట్టిన సమావేశం మినట్స్ ఆధారంగా మాట్లాడుతున్నామన్నారు. రెండు సమావేశాల్లోనూ తెలంగాణ, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శులు కేఆర్ఎంబీకి అప్పగించినట్లుగా సంతకాలు చేశారన్నారు.

More Telugu News