Nara Bhuvaneswari: రాజధాని కోసం పోరాడుతున్న రైతులకు పాదాభివందనాలు: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari held meeting with women milk farmers
  • మంగళగిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన
  • వెంకటపాలెంలో మహిళా పాడి రైతులతో ముఖాముఖి
  • అమరావతి ఉద్యమంలో మహిళా శక్తిని చాటారని అభినందనలు
  • టీడీపీ వచ్చాక అమరావతే రాజధానిగా కొనసాగుతుందని భరోసా 
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటనకు విచ్చేశారు. వెంకటపాలెంలో ఆమె మహిళా పాడిరైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ, రాజధాని కోసం పోరాడుతున్న రైతులకు పాదాభివందనాలు అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. అమరావతి ఉద్యమంలో మహిళా శక్తిని చాటారని కొనియాడారు. పోలీసుల దౌర్జన్యాలు, అవమానాలను మహిళలు భరించారని పేర్కొన్నారు. అమరావతి మహిళలెవరూ నిరుత్సాహపడొద్దని, టీడీపీ అధికారంలోకి వచ్చాక అమరావతే రాజధానిగా కొనసాగుతుందని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. 

మహిళలు  స్వయంశక్తితో ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆడబిడ్డలకు విద్యావకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Nara Bhuvaneswari
Milk Farmers
Women
Amaravati
TDP
Mangalagiri
Andhra Pradesh

More Telugu News