Revanth Reddy: బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

  • ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం
  • బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ మార్పు స్పీకర్ నిర్ణయమని వెల్లడి
  • బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్న రేవంత్ రెడ్డి
  • కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్న రేవంత్ రెడ్డి
Revanth reddy responds on brslp

బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయ మార్పుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన గురువారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశంపై ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పందించారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం మార్పు స్పీకర్ నిర్ణయమని స్పష్టం చేశారు.  

ఇక బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. వివిధ అంశాలపై చర్చ అవసరమనుకుంటే స్పీకర్ సభను పొడిగించవచ్చునని చెప్పారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. అందుకే కృష్ణా బేసిన్‌లో బీఆర్ఎస్‌ను ప్రజలు తిరస్కరించారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ ముఖ్యమంత్రిగా తాను అవసరమైతే కేసీఆర్‌ను కూడా కలుస్తానని స్పష్టం చేశారు.

సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పింది

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందన్నారు. విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని సూచించిందన్నారు. హైకోర్టు చెప్పిన అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. మిషన్ భగీరథపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు. కృష్ణా జలాల విషయంలో ఆయన చిత్తశుద్ధిని ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగానికి రాకపోవడంతోనే ఆయన బాధ్యత తెలిసిపోతుందన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానివేశారన్నారు. విధానపరమైన లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నట్లు చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై అధిష్ఠానం నిర్ణయిస్తుందన్నారు.

More Telugu News