Irfan Pathan: పవన్ కల్యాణ్ గురించి మాట్లాడిన ఇర్ఫాన్ పఠాన్... వీడియో ఇదిగో!

  • త్వరలో ఐపీఎల్ నయా సీజన్
  • దేశవ్యాప్తంగా ప్రమోషన్ ఈవెంట్లు
  • తెలుగు రాష్ట్రాల్లోనూ ఐపీఎల్ ప్రచార కార్యక్రమాలు
  • హాజరైన మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్
Former cricketer Irfan Pathan terms Pawan Kalyan as Power Star

మార్చి మూడో వారంలో ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుండగా, అధికారిక ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ చానల్ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఐపీఎల్ ప్రమోషన్ ఈవెంట్లు జరుగుతున్నాయి. 

తాజాగా, ఓ ప్రచార కార్యక్రమానికి భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ హాజరయ్యారు. యాంకర్ టాలీవుడ్ హీరోల గురించి అడుగుతుండగా, ఇర్ఫాన్ పఠాన్ ఆయా హీరోల డైలాగులు చెబుతూ అందరినీ అలరించారు. 

ఈ క్రమంలో "నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది" అంటూ పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' చిత్రంలోని పాప్యులర్ డైలాగ్ చెప్పి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా యాంకర్ పవన్ కల్యాణ్ అని పలకగా, ఇర్ఫాన్ పఠాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. "పవన్ కల్యాణ్ కాదు... ఆయనను ఏమని పిలవాలో తెలుసా... పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అని పిలవాలి" అని పేర్కొన్నారు. దాంతో ఆ కార్యక్రమంలో ఈలలు, కేకలు మిన్నంటాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

More Telugu News