Jagan: ఢిల్లీకి వెళ్తున్న జగన్.. మోదీతో భేటీ

Jagan meeting Modi tomorrow
  • రేపు ఉదయం మోదీతో సమావేశం కానున్న జగన్
  • నిన్న రాత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు
  • రసవత్తరంగా మారుతున్న ఏపీ రాజకీయాలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రేపు ఉదయం ప్రధానిని జగన్ కలవనున్నారు. ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండానే హఠాత్తుగా జగన్ ఢిల్లీకి వెళ్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసిందే. దాదాపు గంటసేపు వీరి మధ్య చర్చలు కొనసాగాయి. రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమిత్ షాను చంద్రబాబు కలవడం, మోదీని జగన్ కలవనుండటం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. జరుగుతున్న పరిణామాలతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
Jagan
YSRCP
Delhi
Narendra Modi
BJP

More Telugu News