Nikki Haley: నిక్కీ హేలీకి దారుణ పరాభవం.. నోటాలో సగం ఓట్లు కూడా రాలేదు!

  • హేలీకి 31 శాతం, నోటాకు 63 శాతం ఓట్లు
  • నెవడాలో నోటా ప్రవేశపెట్టాక ఓటమి పాలైన తొలి అభ్యర్థిగా నిక్కీ హేలీ చెత్త రికార్డు
  • డెమొక్రటిక్ ప్రైమరీలో జో బైడెన్ తిరుగులేని విజయం
Nikki Haley losses to none of these candidates

అమెరికా అధ్యక్ష పదవి కోసం ట్రంప్‌తో పోటీపడుతున్న రిపబ్లికన్ నేత నిక్కీ హేలీకి దారుణ పరాభవం ఎదురైంది. నెవడా రాష్ట్రంలో మంగళవారం జరిగిన డెమొక్రటిక్ పార్టీ ఓటర్ల ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించగా, రిపబ్లికన్ ప్రైమరీలో నిక్కీ హేలీ తిరస్కారానికి గురయ్యారు. ఆమె కంటే కూడా నోటాను పోలిన ‘ఈ అభ్యర్థులెవరూ కాదు’ అనే కాలమ్‌నే ఎక్కువమంది ఎంచుకున్నారు.

హేలీకి 31 శాతం ఓట్లు మాత్రమే పోలవగా, నోటాకు ఏకంగా 63 శాతం ఓట్లు వచ్చాయి. అంతేకాదు, నెవడాలో 1975లో నోటాను ప్రవేశపెట్టిన తర్వాత ఓటమి పాలైన తొలి అభ్యర్థి కూడా హేలీనే కావడం గమనార్హం. ఆమె సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినాలో ఈ నెల 24న ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. నెవడా ప్రైమరీలో పోటీ పడని ట్రంప్.. సౌత్ కరోలినాలో మాత్రం హేలీతో పోటీపడనున్నారు. కాగా, నెవడాలో జరిగిన డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీలో బైడెన్ పోటీ అన్నదే లేకుండా 90 శాతం ఓట్లతో విజయం సాధించారు.

More Telugu News