sammakka sarakka: మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు 'బంగారం మొక్కుల'పై దేవాదాయ శాఖ శుభవార్త

  • ఆన్ లైన్ ద్వారా మొక్కులు చెల్లించే వెసులుబాటును కల్పించిన ప్రభుత్వం
  • జాతరకు వెళ్లలేని భక్తులకు అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని కల్పించిన ప్రభుత్వం
  • ఆన్ లైన్ మొక్కులు చెల్లించే వెసులుబాటును నేడు ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ
  • ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా పొందే అవకాశం కూడా ఉన్నట్లు వెల్లడి
Endowment department relief to medaram devotees

సమ్మక్క సారలమ్మ భక్తులకు దేవాదాయ శాఖ ఆన్ లైన్ ద్వారా మొక్కులు చెల్లించే వెసులుబాటును కల్పించింది. ఈ సదుపాయాన్ని మంత్రి కొండా సురేఖ బుధవారం ప్రారంభించారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తుల కోసం అమ్మవార్లకు ఇచ్చే నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. భక్తులు వారి బరువు ప్రకారం కిలోకు రూ.60 చొప్పున... ఎన్ని కిలోలు ఉంటే అంత మొత్తం చెల్లించి నిలువెత్తు బంగారం సమర్పణను బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు పోస్ట్ ద్వారా మేడారం ప్రసాదంను పొందే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.

కాగా, మేడారం జాతరకు నేడు అంకురార్పణ జరిగింది. గుడిమెలిగే పండుగతో జాతర తొలిఘట్టం ప్రారంభమైంది. మహా జాతరకు రెండు వారాల ముందు గుడిమెలిగే తంతు నిర్వహిస్తారు. గుడిమెలిగేలో భాగంగా మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండేళ్లకోసారి జరిగే ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం పండుగ ఈ నెల 21న ప్రారంభమై నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది.

More Telugu News