ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర స్పందన
- గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్న టీడీపీ అధినేత
- ఇరు పార్టీల మధ్య పొత్తుపై చర్చల కోసమేనంటూ వెలువడుతున్న ఊహాగానాలు
- చంద్రబాబు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా తమకు సంబంధం లేదన్న మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లడంపై ఏపీ మంత్రి, వైఎస్సార్‌సీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా తమకు సంబంధం లేదని, తమ నాయకుడు ఒంటరిగానే వెళతామని చెప్పారని ప్రస్తావించారు. ‘‘చంద్రబాబు ఢిల్లీ పర్యటన పొత్తుల కోసమా?.... అయితే అది జరిగితే అప్పుడు స్పందిస్తా’’ అని అన్నారు. ఇక ఏపీసీసీ చీఫ్ షర్మిల భద్రతపై స్పందిస్తూ.. తనకు కూడా గతంలో భద్రతను తొలగించారని, అప్పుడు తనకు ముప్పు లేదని భావించి మరింత స్వేచ్చగా తిరిగానని మంత్రి బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు. షర్మిలకు ఎప్పుడు సెక్యూరిటీ పెంచారో, ఎప్పుడు తగ్గించారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.