Vijay Devarakonda: 'ది ఫ్యామిలీ స్టార్' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ!

  • 'ఫ్యామిలీ స్టార్'గా విజయ్ దేవరకొండ 
  • ఆయన సరసన సందడి చేసే మృణాళిని ఠాకూర్
  • సంగీతాన్ని సమకూర్చిన గోపీసుందర్ 
  • ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల  
The Family Star Lyrical Song Released

విజయ్ దేవరకొండ అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన 'ది ఫ్యామిలీ స్టార్' కోసం వెయిట్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లోనే ఈ సినిమా రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ దేవరకొండ సరసన నాయికగా మృణాళిని ఠాకూర్ అలరించనుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ' ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో, సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో' అంటూ ఈ పాట సాగుతోంది. గోపీసుందర్ స్వరపరిచిన ఈ మెలోడీ గీతాన్ని సిద్ శ్రీరామ్ ఆలపించాడు. సాహిత్యాన్ని అనంత్ శ్రీరామ్ అందించాడు. 

' సిరుల వధువులా ఎదుట నించుంది .. విరుల ధనువులా ఎదని వంచింది' వంటి ప్రయోగాలను అనంత్ శ్రీరామ్ చేశాడు. ఈ పాటలో విజయ్ దేవరకొండ వేసిన ఒక స్టెప్ వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలం తరువాత మంచి ఫీల్ ఉన్న ఒక మెలోడీ సాంగ్ విన్న అనుభూతి కలుగుతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News