Treason Cases: ఐదేళ్లలో దేశంలో ఎన్ని దేశద్రోహం కేసులు నమోదయ్యాయంటే..!

  • 2018-22 మధ్యకాలంలో 701 దేశద్రోహం కేసుల నమోదు
  • 5,023 చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కేసుల నమోదు
  • లోక్ సభలో వివరాలను వెల్లడించిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి
701 treason cases filed in 5 years in India

2018 నుంచి 2022 మధ్యకాలంలో మన దేశంలో 701 దేశద్రోహం కేసులు... 5,023 చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కేసులు నమోదయ్యాయి. ఈ వివరాలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. ఈ కేసుల్లో 788 మంది అరెస్ట్ అయ్యారని, 500 మందిపై ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయని తెలిపారు. 131 మందిని కోర్టులు నిర్దోషులుగా విడుదల చేశాయని చెప్పారు. 2021లో 149 దేశద్రోహం కేసులు, 2022లో 68 దేశద్రోహం కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

More Telugu News