YS Sharmila: జగన్, చంద్రబాబులకు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

  • విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా అమలు చేయలేదన్న షర్మిల
  • విభజన హామీల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్రానికి పంపాలని సూచన
  • ఇది రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి చేయాల్సిన పోరు అని వ్యాఖ్య
YS Sharmila open letter to Jagan and Chandrababu

ఏపీ విభజన హామీల అమలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా వీటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు. కేంద్రానికి విభజన హామీలను గుర్తు చేస్తూ పోరాటం సాగించాలని చెప్పారు. ఈ మేరకు ఆమె సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులకు బహిరంగ లేఖ రాశారు. 

విభజన హామీలపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని లేఖలో ఆమె సూచించారు. తన లేఖలో తమ డిమాండ్లను మీ ముందుంచామని చెప్పారు. మీమీ పార్టీల తరపున అసెంబ్లీ వేదికగా చర్చించాలని అన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరం చేయాల్సిన పోరు అని చెప్పారు. 

More Telugu News