Upasana: పిల్లల్ని కనడంలో ఆలస్యం కావడానికి కారణం ఇదే: ఉపాసన

Upasana reveals the reason for delay in having children

  • తల్లిదండ్రులు కావడానికి పూర్తిగా సన్నద్ధం అయిన తర్వాతే పిల్లల్ని కనాలన్న ఉపాసన
  • తాను, చరణ్ ఇద్దరం ఇదే నిర్ణయం తీసుకున్నామని వెల్లడి
  • అమ్మ కావడాన్ని తాను డబుల్ గ్రేట్ అనుకుంటానన్న ఉపాసన

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, అపోలో హాస్పిటల్స్ వారసురాలు ఉపాసన 2012లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీరికి చాలా ఏళ్ల పాటు పిల్లలు కలగలేదు. దీంతో, ఏదో సమస్య ఉన్నట్టుందని... ఉపాసన పిల్లల్ని కనకపోవచ్చనే ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారికి క్లీంకార అనే పేరు పెట్టుకున్నారు. 

మరోవైపు, తమకు పిల్లలు పుట్టడం ఆలస్యం కావడానికి గల కారణాన్ని ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అమ్మ కావడాన్ని అందరూ గ్రేట్ అనుకుంటారని... తాను మాత్రం డబుల్ గ్రేట్ అనుకుంటానని ఆమె తెలిపారు. తమకు పిల్లలు పుట్టడం లేట్ కావడంతో... ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే కామెంట్లు తన వరకు కూడా వచ్చాయని చెప్పారు. పిల్లల్ని కనడానికి పూర్తిగా సన్నద్ధం అయిన తర్వాతే కనాలని తాను, రామ్ చరణ్ అనుకున్నామని... అందుకే తల్లిదండ్రులు కావడానికి సమయం తీసుకున్నామని వెల్లడించారు. 

వ్యక్తిగతంగా తాను, చరణ్ ఎంతో సన్నిహితంగా ఉంటామని... కానీ, వృత్తి పరమైన విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోబోమని ఉపాసన తెలిపారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరం గౌరవం ఇస్తామని చెప్పారు. బిజినెస్ ఉమన్ గా రాణిస్తున్న ఉపాసన... సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే.

Upasana
Ramcharan
Daughter
Tollywood
  • Loading...

More Telugu News