Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సింగపూర్ సంస్థ మెయిన్ హార్ట్, ఫిషిన్ ఇండియా ప్రతినిధుల భేటీ

representatives of Fishin India Company met CM Revanth Reddy at  Secretariat
  • సచివాలయంలో సీఎంతో వేర్వేరుగా భేటీ అయిన మెయిన్ హార్ట్, ఫిషిన్ ఇండియా ప్రతినిధులు
  • మూసీ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టేందుకు మెయిన్ హార్ట్ కంపెనీ ఆసక్తి
  • భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నమూనాలు తయారు చేయాలని సీఎం సూచన
తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలువురు కంపెనీల ప్రతినిధులు మంగళవారం సమావేశమయ్యారు. సింగపూర్ సంస్థ మెయిన్ హార్ట్ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టును చేపట్టేందుకు మెయిన్ హార్ట్ కంపెనీ ఆసక్తి కనబరుస్తోంది. ప్రాజెక్టు నమూనాలపై ముఖ్యమంత్రికి కంపెనీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నమూనాలు తయారు చేసి తీసుకు రావాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.

సీఎంను కలిసిన ఫిషిన్ ఇండియా కంపెనీ ప్రతినిధులు

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫిషిన్ ఇండియా కంపెనీ ప్రతినిధులు జాయ్ ఫోక్, మనీష్ కుమార్, అల్తాఫ్ అలీ ఖాన్, వందన కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
Revanth Reddy
Congress
BRS

More Telugu News