Paytm: ఒక్కసారిగా పెరిగిన ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ యాప్ డౌన్ లోడ్స్... కారణం పేటీఎం!

  • పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు విధించిన ఆర్బీఐ
  • మందగించిన పేటీఎం కార్యకలాపాలు
  • ఇతర పేమెంట్స్ యాప్ ల వైపు మళ్లుతున్న ప్రజలు
Paytm decline causes raise in other payment apps downloads

ఆర్బీఐ ఆంక్షల ఫలితంగా పేటీఎం కార్యకలాపాలు మందగించాయి. ఈ పరిణామం ఇతర పేమెంట్ యాప్ లకు బాగా లాభించింది. గత కొన్ని రోజులుగా ఫోన్ పే, గూగుల్  పే, భీమ్ యూపీఐ యాప్ ల డౌన్ లోడ్ల సంఖ్య గణనీయంగా పెరగడమే అందుకు నిదర్శనం. 

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు 10.4 లక్షల మంది ఫోన్ పే యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఒక్క ఫిబ్రవరి 3వ తేదీనే ఫోన్ పే యాప్ ను 2.79 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారట. 

అదే సమయంలో, గూగుల్ పే యాప్ ను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు 3.95 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన భీమ్ యాప్ కూడా ఇదే అదనుగా పుంజుకుంది. భీమ్ యాప్ కు 50 శాతం మేర డౌన్ లోడ్లు పెరిగాయి. జనవరి 19 నాటికి గూగుల్ ప్లే స్టోర్ లో భీమ్ యాప్ ర్యాంకు 326 కాగా... ఫిబ్రవరి 5 కల్లా ఏడో స్థానానికి ఎగబాకింది.

More Telugu News