DSC: అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థుల భారీ ర్యాలీ

DSC aspirants takes huge rally in Avanigadda
  • అవనిగడ్డలో రోడ్డెక్కిన డీఎస్సీ అభ్యర్థులు
  • మినీ డీఎస్సీ వద్దు... మెగా డీఎస్సీ కావాలి అంటూ నినాదాలు
  • అవనిగడ్డలో భారీగా మోహరించిన పోలీసులు
  • నిరుద్యోగులకు మద్దతు పలికిన టీడీపీ, జనసేన నేతలు

కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు. వందలాదిగా తరలివచ్చిన డీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులు భారీ ర్యాలీగా అవనిగడ్డ కూడలి వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించిన డీఎస్సీ అభ్యర్థులు మినీ డీఎస్సీ వద్దు... మెగా డీఎస్సీ కావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, అవనిగడ్డలో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకు దిగిన నిరుద్యోగులకు టీడీపీ, జనసేన నేతలు మద్దతు పలికారు. 

ఏపీలో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే, 30 వేల ఖాళీలు ఉంటే 6 వేల టీచర్ పోస్టులే భర్తీ చేయడం ఏంటని విపక్షాలు మండిపడుతున్నాయి.

  • Loading...

More Telugu News