KCR: నన్ను... నా పార్టీని టచ్ చేయడం నీతో కాదు: రేవంత్ రెడ్డికి కేసీఆర్ హెచ్చరిక

KCR challenges Revanth Reddy to touch brs party
  • తనను... పార్టీని కొత్త ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారన్న కేసీఆర్
  • రేవంత్ రెడ్డి కంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర బీఆర్ఎస్‌కు ఉందని వ్యాఖ్య
  • తెలంగాణ కోసం తాను ఏనాడూ వెనక్కి పోనన్న బీఆర్ఎస్ అధినేత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ తన మీద చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు బీఆర్ఎస్ భవన్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ స్పందించారు. వ్యక్తిగతంగా తనను.. అలాగే బీఆర్ఎస్ పార్టీని కొత్త ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని మండిపడ్డారు. తనను... తన పార్టీని టచ్ చేయడం నీతో కాదు... నీ కంటే హేమాహేమీలను ఎదుర్కొన్న చరిత్ర మాకు... మా పార్టీకి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్ధేశించి అన్నారు.  తెలంగాణను పదేళ్లు పదిలంగా కాపాడాం... ఇప్పుడు మీరు దీనిని పరాయివాళ్ల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ కోసం కేసీఆర్ ఏనాడూ వెనక్కిపోడు... ఉడుత బెదిరింపులకు భయపడే ప్రసక్తిలేదని వ్యాఖ్యానించారు. ముందు ముందు ఏందో చూద్దాం... తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేయాలో నాకు బాగా తెలుసునని అన్నారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా పదేళ్లలో ఏనాడూ తెలంగాణ ప్రాజెక్టులు అప్పగించలేదన్నారు. ప్రాజెక్టులు తమకు అప్పగించాలని, లేదంటే మేమే నోటిఫై చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తనను బెదిరించినట్లు తెలిపారు. 'కావాలంటే తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టుకో... నా ప్రభుత్వాన్ని రద్దు చేస్తా... తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే అస్సలే ఊరుకోను.. ప్రాజెక్టులు అప్పగించే ప్రసక్తే లేద'ని ఆనాడే కేంద్రమంత్రికి చెప్పానన్నారు.
KCR
Revanth Reddy
Telangana
BRS
Congress

More Telugu News