Chandrababu: రేపు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు.. బీజేపీ పెద్దలతో భేటీ

Chandrababu going to Delhi to meet BJP top leaders
  • ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్న కీలక మలుపు
  • చంద్రబాబు వెంట పవన్ కల్యాణ్ వెళ్లే అవకాశం
  • టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు పొడిచే ఛాన్స్

ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు మారబోతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు. చంద్రబాబు వెంట జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రేపు వెళ్లని పక్షంలో చంద్రబాబు పర్యటన తర్వాత పవన్ ఢిల్లీకి వెళ్తారు. రేపు రాత్రికి చంద్రబాబు ఢిల్లీకి చేరుకుంటారు. 

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య పొత్తుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకుని, కలిసి పని చేస్తున్నాయి. మరోవైపు, జనసేనతో తమ పార్టీ పొత్తులోనే ఉందని రాష్ట్ర బీజేపీ నేతలు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News