Kanguva: సూర్య కెరియర్లో ప్రత్యేకం 'కంగువ' .. ఆ ఒక్క సీన్ చాలట!

  • సూర్య హీరోగా రూపొందుతున్న 'కంగువ'
  • ఆయన జోడీకట్టిన దిశా పటాని 
  • ప్రతినాయకుడిగా కనిపించనున్న బాబీ డియోల్ 
  • 38 భాషలలో విడుదల చేయాలనే ఆలోచన

Kanguva Movie Update

సూర్య కెరియర్ ను పరిశీలిస్తే మొదటి నుంచి కూడా ఆయన చేస్తూ వచ్చిన ప్రయోగాలు కనిపిస్తాయి. అలా ఇప్పుడు కూడా ఆయన ఒక ప్రయోగాత్మక చిత్రానికి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పేరే 'కంగువ'. ఈ సినిమాలో సూర్య ఒక యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన పోస్టర్స్, ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ - స్టూడియో గ్రీన్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వీఎఫెక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకోసం భారీమొత్తమే కేటాయించారని టాక్. వైవిధ్యభరితమైన కథ .. విలక్షణమైన పాత్ర కావడంతో సూర్య అభిమానులంతా ఈ సినిమా ఆయన కెరియర్లో ప్రత్యేక స్థానంలో నిలుస్తుందని భావిస్తున్నారు. 

ముఖ్యంగా ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేసిన తీరు 'ఔరా' అనిపిస్తుందట. మొసలితో సూర్య పోరాడే దృశ్యం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సీన్ కి క్లాప్స్ .. విజిల్స్ పడతాయని అంటున్నారు. దిశా పటాని కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా బాబీ డియోల్ కనిపించనున్నాడు. 38 భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లనున్నారని సమాచారం.

More Telugu News