Tamilisai Soundararajan: లోక్‌సభ ఎన్నికల బరిలోకి తెలంగాణ గవర్నర్ తమిళిసై?

  • తూత్తుకుడి లేదంటే విరుదునగర్ నుంచి బరిలోకి?
  • గతంలో పోటీచేసిన ప్రతిసారీ ఓటమి చవిచూసిన సౌందరరాజన్
  • 2019 ఎన్నికల్లో కనిమొళి చేతిలో ఓటమి
Telangana Governor Tamilisai ready fray into elections

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమె తమిళనాడులోని తూత్తుకుడి లేదంటే విరుదునగర్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 1999లో బీజేపీలో చేరిన తమిళిసై.. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర చెన్నై నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2011 ఎన్నికల్లో వేళచ్చేరి నియోజకవర్గం నుంచి పోటీచేసి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గవర్నర్‌గా పంపింది. ప్రస్తుతం ఆమె పుదుచ్చేరి ఇన్‌చార్జి ఎల్జీగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. కాగా, తమిళిసై తండ్రి కమరి ఆనంద్‌ తమిళనాడు కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు.

More Telugu News