IT Layoffs: ఈ ఏడాది జనవరిలో ఎన్ని ఐటీ జాబ్స్ పోయాయో తెలుసా?

  • జనవరిలో మొత్తం 32 వేల మంది ఐటీ జాబ్స్ కోల్పోయారన్న  Layoffs.fyi
  • గతంతో పోలిస్తే ఈసారి లేఆఫ్స్ తీవ్రత తక్కువగా ఉంటుందని వెల్లడి
  • అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించే వరకూ అనిశ్చితి కొనసాగే అవకాశం
Tech Layoffs Continue To Hit Industry With 32000 Job Cuts

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఐటీ రంగంలో లేఆఫ్స్ మొదలయ్యాయి. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని ప్రకటించాయి. సోమవారం స్నాప్ ఐఎన్‌సీ సంస్థ 540 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ప్రకటించింది. ఐటీ జాబ్స్ ట్రాకింగ్ సంస్థ Layoffs.fyi ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటివరకూ సుమారు 32 వేల మంది ఐటీ నిపుణులు ఉద్వాసనకు గురయ్యారు. 

కరోనా సంక్షోభ సమయంలో నియమించుకున్న వారిని తొలగించేందుకు కంపెనీలు ఈ ఏడాదీ లేఆఫ్స్‌ను కొనసాగిస్తున్నాయని సంస్థ సీఈఓ పేర్కొన్నారు. ఈ ఏడాది తొలగింపులు మునుపటి కంటే తక్కవ స్థాయిలో ఉంటాయని చెప్పారు. అయితే, గతంలో కంటే ఎక్కువ కంపెనీలు ఈసారి లేఆఫ్స్ ప్రకటిస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. 

తొలగింపుల వెనక ప్రధాన కారణం ఆర్థిక అంశాలే అయినప్పటికీ, ఏఐ పాత్ర కూడా కొంత ఉందని రాజర్ లీ అన్నారు. ఏఐ నైపుణ్యాలు కావాల్సిన పోస్టుల సంఖ్య డిసెంబర్  నుంచి జనవరి మధ్యలో 2 వేల నుంచి 17479కి పెరిగాయని తెలిపారు. టెక్ రంగంలో తొలగింపులు కొనసాగుతున్న ఏఐ లాంటి విభాగాల్లో నియామకాలు కొనసాగుతున్నాయని అన్నారు. అయితే, చాలామటుకు లేఆఫ్స్ ముగిశాయని, కంపెనీలు మళ్లీ కోలుకోవడం ప్రారంభిస్తాయని ఇన్‌సైట్ గ్లోబల్ సంస్థ సీఈఓ బెర్ట్ బీన్ తెలిపారు. రాబోయే రెండు త్రైమాసికాల్లో మార్కెట్లో కొంత అనిశ్చితి కొనసాగుతుందని చెప్పారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్..వడ్డీ రేట్లలో కోత పెట్టే వరకూ ఒడిదుడుకులు తప్పవని అన్నారు.

More Telugu News