S.V.Krishna Reddy: ‘గుంటూరు కారం’ పోయింది అందుకే.. దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి కామెంట్స్

  • హీరోకు అనువుగా మూవీని మలిస్తే అపజయం తప్పదన్న సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి
  • అందుకే ‘టాప్ హీరో’, ‘వజ్రం’ ఫలితం ఇవ్వలేదని వ్యాఖ్య
  • ‘గుంటూరు కారం’ విషయంలోనూ ఇదే జరిగిందని కామెంట్
  • కథనే నమ్ముకుంటే అపజయం ఉండదని స్పష్టీకరణ
SV Krishnareddy comments on failure of Guntur karam

ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్లతో 90వ దశకంలో వరుస హిట్లు అందుకున్న సినీ దర్శకుడు ఎస్వీ కృష్టారెడ్డి. ఆయన సినిమా అంటేనే హిట్ అనే స్థాయిలో అభిమానుల్లో అంచనాలు ఉండేవి. నాటి సినిమాలు ఇప్పటి తరానికీ పరిచయమే. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్వీ కృష్ణారెడ్డి తన సినిమాలు అపజయం పాలైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. బాలకృష్ణతో తీసిన టాప్ హీరో, నాగార్జునతో తీసిన వజ్రం సినిమాలు అంచనాలు అందుకోలేదని అంగీకరించారు. ఇందుకు గల కారణాలను వివరించిన ఆయన.. హీరో ఇమేజ్‌కు అనుగూణంగా సినిమాలు తీస్తే అపజయం తప్పదని వ్యాఖ్యానించారు. 

‘‘ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో..అప్పుడు తేడా కొడుతుంది. ఇప్పుడు వచ్చిన గుంటూరు కారం చూడండి.. మహేశ్ బాబుకు తగ్గట్టుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ కిందా, మీదా పడిపోయారు. ఎప్పుడూ ఇలా చేయకూడదు. కథను నమ్ముకంటే ఫెయిల్యూర్ అనేదే ఉండదు. అందుకే యమలీల అంత పెద్ద హిట్ అయ్యింది’’ అని ఎస్వీ కృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు.

More Telugu News