Telangana: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్‌లో TS ను TGకి మార్చుకోవాలా?

  • TS నుంచి TGకి మారనున్న వాహనాల రిజిస్ట్రేషన్
  • జీవో తర్వాత వచ్చే కొత్త వాహనాలకు మాత్రమే వర్తిస్తుందంటోన్న అధికారులు
  • రాష్ట్ర విభజన సమయంలో ఏపీ నుంచి టీఎస్‌కు మార్చుకోవాల్సిన అవసరం రాలేదని వివరణ 
TS name to change to TG after government GO

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాహన రిజిస్ట్రేషన్లలో ఇప్పటిరకు నెంబరుకు ముందు రాష్ట్రం పేరును సూచించేలా టీఎస్ (TS) అనే అక్షరాలు ఉండేవి. అయితే, టీఎస్ స్థానంలో ఇకపై టీజీ (TG) అనే అక్షరాలు రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో తమ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్‌ను మార్చుకోవాలా? అనే అనుమానాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రవాణాశాఖ అధికారులు నెంబర్ మార్పుపై స్పష్టతను ఇస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. జీవో ఇచ్చిన తర్వాత కొత్తగా వచ్చే వాహనాలకు మాత్రమే టీజీ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారని చెబుతున్నారు. గతంలో రాష్ట్ర విభజన నేపథ్యంలోనూ ఏపీ నుంచి టీఎస్‌గా మార్చుకోవాల్సిన అవసరం రాలేదని గుర్తు చేస్తున్నారు. అప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు యథావిధిగా కొనసాగాయని... ఇప్పుడూ అదే పద్ధతి కొనసాగవచ్చునని అంటున్నారు.

More Telugu News