'రాజా సాబ్' మామూలుగా ఉండదన్న మారుతి!
- ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'రాజా సాబ్'
- కంటెంట్ ను గోప్యంగానే ఉంచిన మారుతి
- మాటల్లో కాదు ... చేతల్లో చూపిస్తానని వెల్లడి
- విజువల్స్ - ఫైట్స్ ఒక రేంజ్ లో ఉంటావని వ్యాఖ్య
తాజాగా మారుతి మాట్లాడుతూ .. "చాలా చిన్న చిన్న సినిమాలతో నా కెరియర్ మొదలైంది. అలాంటి నేను ప్రభాస్ సినిమా .. అందునా పాన్ ఇండియా సినిమా చేసే స్థాయికి రావడం నిజంగా నాకు ఆనందాన్ని కలిగించే విషయం. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని .. నాపై ప్రభాస్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే ట్రై చేస్తున్నాను" అని చెప్పారు.
" ఈ సినిమాను గురించి నేను మాటల్లో చెప్పాలనుకోవడం లేదు .. చేతల్లో చూపించాలనుకుంటున్నాను. ఒకటి మాత్రం చెబుతాను. ఈ సినిమా విజువల్స్ గురించి .. యాక్షన్ సీన్స్ గురించి చాలా కాలం మాట్లాడుకుంటారు" అని అన్నారు. వందల కోట్ల బడ్జెట్ లో వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న ప్రభాస్, ఆ స్థాయికి కాస్త తక్కువగా ఉన్న ఈ ప్రాజెక్టును సెట్ చేసుకుని చాలామందిని ఆశ్చర్యపరిచాడు. మరి అంతగా ఈ కంటెంట్లో ఏముందనేది చూడాలి.