Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీఆర్ఎస్

BRS burns effigy of CM Revanth Reddy
  • కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ భువనగిరిలో దిష్ఠిబొమ్మ దగ్ధం
  • గౌరవప్రదమైన హోదాలో ఉండి గల్లీ లీడర్‌లా మాట్లాడుతున్నారని విమర్శ
  • పరిపాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం... కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని ఆగ్రహం
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. భువనగిరిలో ప్రిన్స్ కార్నర్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు... సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గౌరవప్రదమైన హోదాలో ఉండి గల్లీ లీడర్‌లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పరిపాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం... తమ పార్టీపైనా, పార్టీ అధినేతపైనా ఇష్టారీతిన విమర్శలు చేస్తోందని... తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ పాలనలో నాడు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌ రాష్ట్రంగా నిలిస్తే... కాంగ్రెస్‌ పాలనలో రెండు నెలులు గడవకముందే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని విమర్శించారు. బీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సూర్యాపేటతో పాటు పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
Revanth Reddy
Congress
BRS

More Telugu News