lal salaam: ఈ వారం బరిలోకి దిగుతున్న రజనీ 'లాల్ సలామ్'

  • ఐశ్వర్య రజనీకాంత్ నుంచి 'లాల్ సలామ్'
  • క్రికెట్ నేపథ్యంలో జరిగే అల్లర్ల చుట్టూ తిరిగే కథ 
  • అతిథి పాత్రలో కనిపించనున్న కపిల్ దేవ్ 
  • ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల

Lal Salaam Movie Update

రజనీకాంత్ నుంచి వచ్చిన 'జైలర్' సంచలన విజయాన్ని సాధించింది. 650 కోట్లకి పైగా ఆ సినిమా వసూలు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ 'వేట్టాయన్' సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తెలుగులో వచ్చేవరకూ వెయిట్ చేయవలసిందేనని అభిమానులు అనుకున్నారు. కానీ ఈ మధ్యలోనే ఆయన నుంచి 'లాల్ సలామ్' రానుంది.

విష్ణు విశాల్ - విక్రాంత్ హీరోలుగా ఐశ్వర్య రజనీకాంత్ 'లాల్ సలామ్' సినిమాను రూపొందిస్తున్నారు. ఇది క్రికెట్ నేపథ్యంలో నడిచే కథ. క్రికెట్ .. దాని నేపథ్యంలో జరిగే అల్లర్లు .. గొడవలు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అందువలన ఈ సినిమాలో కపిల్ దేవ్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారు. లైకా నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఈ సినిమాలో రజనీకాంత్ మొయినుద్దీన్ భాయ్ అనే కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య రజనీకాంత్ ... లైకా వారు రిక్వెస్ట్ చేయడం వలన ఈ పాత్రను చేయడానికి రజనీ అంగీకరించారని అంటున్నారు. అయితే తెరపై రజనీ కనిపించేంతవరకూ ఆ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని చెబుతున్నారు. రజనీ సోదరిగా జీవిత నటించిన ఈ సినిమాకి, సంగీతాన్ని ఏఆర్ రెహ్మాన్ అందించారు. 

More Telugu News