Rakul Preet Singh: థాయిలాండ్ లో రకుల్ ప్రీత్ సింగ్ బ్యాచిలర్ పార్టీ.. హాజరైన మంచు లక్ష్మి

Manchu Lakshmi attends Rakul Preet Singh bachelor party

  • ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడుతున్న రకుల్
  • ఈ నెల 21న గోవాలో జరగనున్న వివాహం
  • థాయ్ లాండ్ లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రకుల్, జాకీ

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కి సినిమా అవకాశాలు తగ్గినా... ఆమె క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. మరోవైపు రకుల్ బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో చాల కాలంగా ప్రేమలో ఉంది. తమ రిలేషన్ షిప్ ను సోషల్ మీడియా వేదికగా వీరు ప్రకటించారు. కొన్ని రోజుల్లో వీరు పెళ్లి చేసుకుని, దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నెల 21న వీరి వివాహం గోవాలో జరగబోతోంది. ఈ క్రమంలో తమ స్నేహితులకు వీరు బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. థాయ్ లాండ్ లో ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ హాజరయ్యారు. రకుల్ కి మంచు లక్ష్మి చాలా క్లోజ్ అనే విషయం తెలిసిందే.

Rakul Preet Singh
Marriage
Manchu Lakshmi
Tollywood
  • Loading...

More Telugu News