Nara Bhuvaneswari: రేపటి నుంచి నాలుగు రోజులపాటు నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర

Nara Bhuvaneswari nijam gelavali yatra starts from tomorrow
  • 9వ తేదీ వరకు కొనసాాగనున్న పర్యటన
  • రేపు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించనున్న భువనేశ్వరి
  • చంద్రబాబు అరెస్ట్ సమయంలో మనస్తాపంతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాల పరామర్శ
‘నిజం గెలవాలి’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి రేపటి నుంచి మరోమారు యాత్రను ప్రారంభించనున్నారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ సమయంలో మనస్తాపంతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. వారిని ఓదార్చి ఆర్థికసాయం అందిస్తారు. 

రేపటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు గుంటూరు, నరసరావుపేట, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు. రేపు (6న) మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తారు. 7న తెనాలి, ప్రత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగుతుంది. 8న తాటికొండ, 9న నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు. పర్యటనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. భువనేశ్వరి పర్యటనలో పలువురు కార్యకర్తలతోపాటు నాయకులు కూడా పాల్గొంటారు.
Nara Bhuvaneswari
Telugudesam
Chandrababu
Nijam Gelavali Yatra

More Telugu News