Balakrishna: వైసీపీ పని అయిపోయింది.. దాని గురించి మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఏమీ లేదు: బాలకృష్ణ

  • ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీకి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • బ్యారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకున్న పోలీసులు
  • జగన్ కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలన్న అచ్చెన్నాయుడు
YSRCP is finished says Balakrishna

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అంతకు ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని, నడుచుకుంటూ అసెంబ్లీకి వెళ్లారు. బైబై జగన్ అంటూ నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండన్, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఎక్కడ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. దీంతో, వారు బ్యారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు. 

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ... వైసీపీ పని అయిపోయిందని, ఆ పార్టీ గురించి మాట్లాడేందుకు ప్రత్యేకంగా ఏమీ లేదని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలను చూసి జగన్ భయపడుతున్నారని... అందుకే పోలీసుల సాయంతో తమను అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దుయ్యబట్టారు. 

అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని చెప్పారు. తాము అసెంబ్లీకి వెళ్లకుండా ఏదో రకంగా అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. సీఎం జగన్ కు ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలని జోస్యం చెప్పారు.

More Telugu News