Cancer Vaccine: కేన్సర్‌ను జయించడంలో పురోగతి.. టీకాను అభివృద్ధి చేసిన బ్రిటన్ శాస్త్రవేత్తలు!

  • కేన్సర్ భయాలు పెరుగుతున్న వేళ గుడ్‌న్యూస్
  • కరోనా టీకా తయారీలో ఉపయోగించే ఎంఆర్ఎన్ఏ సాంకేతితతో కేన్సర్ టీకా అభివృద్ధి
  • ట్రయల్స్‌లో మంచి ఫలితాలు
  • కేన్సర్ చికిత్స గతిని మార్చనున్న టీకా
Britain scientists developed Vaccine for cancer

ఇటీవలి కాలంలో కేన్సర్ మరణాలు ఎక్కువయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మరణాలు సంభవిస్తున్నాయి. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ కేసులు 77 శాతానికి చేరుకుంటాయని, ఏటా మూడున్నర కోట్ల మంది దాని బారినపడతారని ఇటీవల ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరికలు జారీ చేసింది. సరిగ్గా ఇలాంటి ఆందోళనల మధ్య  బ్రిటన్ శాస్త్రవేత్తలు గుండెలనిండా ఊపిరి పీల్చుకునే వార్త ఒకటి చెప్పారు. కేన్సర్‌ను అరికట్టే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. 

కరోనా టీకా తయారీలో ఉపయోగించే మెసెంజర్ ఆర్ఎన్ఏ (ఎంఆర్ఎన్ఏ) సాంకేతికతను వాడి దీనిని అభివృద్ధి పరిచినట్టు వివరించారు. గ్లోబల్ ట్రయల్స్‌లో భాగంగా బ్రిటన్‌లో కేన్సర్ రోగులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి మంచి ఫలితాలు సాధించారు. ఈ మేరకు లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఊపిరితిత్తులు, చర్మ కేన్సర్, ఇతర క్యాన్సర్లపై వ్యాక్సిన్ సామర్థ్యం, సురక్షితను అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఎంఆర్ఎన్ఏ-4539 పేరుతో పిలుస్తున్న ఈ కేన్సర్ టీకాను చర్మ కేన్సర్‌తో బాధపడుతున్న సర్రేకు చెందిన 81 ఏళ్ల వృద్ధుడిపై ప్రయోగించి సత్ఫలితాలు సాధించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రయోగ ఫలితాలు భవిష్యత్‌లో కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులకు కారణం అవుతాయని వివరించారు. ఈ కేన్సర్ టీకా కేన్సర్ రోగి శరీరంలోని సొంత రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడం వల్ల రక్షణ వ్యవస్థ మరింత మెరుగ్గా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు.

More Telugu News